ద్రోణ కర్నూల్ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఓ వ్యక్తికి ఇచ్చిన మాటను 24 గంటల్లో నిలబెట్టుకున్నారు. పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడలో సీఎం పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానికంగా నివాసం ఉంటున్న తలారి గంగమ్మ అనే మహిళ కుమారుడు అశోక్ కు ఎలక్ట్రిక్ ఆటో ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు.. రూ.3.80 లక్షలు విలువైన ఎలక్ట్రిక్ ఆటోను ఎమ్మెల్యే శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం అశోకక్ కు అందజేశారు.అలాగే కవిత అనే మహిళ తన భర్త వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబును కోరారు. వైద్య ఖర్చులకు రూ. లక్ష అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా.. కవితకు చెక్కును అందజేశారు.
