Sunday, February 15, 2026

రోడ్ల పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క

ద్రోణ వరంగల్

పర్వతగిరి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా చెట్లను నాటి అనంతరం ఫ్యాక్స్ నూతన భవనము మరియు 500మెట్రిక్ టన్నుల గోదాముల మరియు శంకుస్థాపన చేసి అనంతరం పర్వతగిరి మండల పరిధిలోని కొంకపాక నుంచి షాపూర్ వరకు 2కోట్ల రూపాయల తో రోడ్డు మరియు కొంకపాక నుంచి జమాల్ పురం వయ్యా వడ్లకొండ చెరువు వరకు 2 కోట్ల 57 లక్షలతో వేసే రోడ్డు మరియు జమాల్ పురం నుంచి వడ్లకొండ 2 కోట్ల 40 లక్షల రూపాయలతో రోడ్డు మరియు పిఆర్ రోడ్డు నుంచి చింతకుంట తండా వరకు 2 కోట్ల రూపాయలు రోడ్ల మరియు అనాంతరం నుంచి నల్లబెల్లి వరకు 70 లక్షల రూపాయలతో వేసే రోడ్డు అనాంతరం

అ గ్రామ నుంచి లోహిత వరకు 1కోటి 80లక్షల తో వేసే రోడ్లకు శంకుస్థాపన చేసిన పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మరియు ఎంపి కడియం కావ్య*తో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ రాజ్ శాఖ నుంచి సుమారు 12కోట్ల రూపాయల నిధులు కేటాయించిన మంత్రి సీతక్క కి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు .ఇచ్చిన మాట ప్రకారం కట్టు బడి ఉండి రాష్ట్రంలో ఒక్క ఒక్కటి 6 గ్యారంటీలను పేదలకు అందిస్తన్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు.
అలాగే పర్వతగిరి మండల కేంద్రంలో 24గం. ల పీహెచ్ ఆసుపత్రి ఉంది దాని 30 పడుకల ఆసుపత్రి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య కృషి చేయాలన్నారు.పర్వతగిరి గడ్డన పుట్టి మొన్న పారిస్ ఒలంపిక్ లో పరుగు పందెంలో 3వ స్థానం సాధించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీస్కొని వచ్చిన జీవంజీ దీప్తి కి అభినందనలు తెలియజేయడం జరిగింది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సం. లోనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్బంగా బిఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు ఓర్వలేక మహిళల ప్రజా ప్రతినిధులనీ చూడకుండా అగౌరవపరుస్తున్నారు ప్రతిపక్ష నాయకులు మరల ఇలాంటివి పునరావృతమైతే మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టేస్క్యాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు, స్టేట్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి రెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, ప్యాక్స్ ఛైర్మన్ల ప్రజా ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నార

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular