Sunday, February 15, 2026

ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని డిజిటల్ కార్డుతోనే

డిజిటల్ సర్వేను పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్

ద్రోణ బోధన్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న డిజిటల్ కార్డు తోనే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించడం జరుగుతుందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ప్రజలకు వివరించారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన వన్ నేషన్ వన్ కార్డు కార్యక్రమాన్ని బోధన్ మండలం లంగడాపూర్ గ్రామంలో అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్న విధానాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు అందజేయనున్నామని సబ్ కలెక్టర్ వివరించారు.

బోధన్ 25 వార్డులో సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్

బోధన్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులో డిజిటల్ సర్వేను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, పలువురు వార్డు కౌన్సిలర్లు, లంగడపూర్ లో బోధన్ తాసిల్దార్ విటల్, పంచాయతీ విస్తీర్ణ అధికారి మధుకర్, మండల అభివృద్ధి అధికారి బాలగంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు పాషా మోహినిద్దీన్, డిసిసి డెలిగేట్ సభ్యులు గంగా శంకర్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular