జెసిబి లకు అడ్డంగా ఎమ్మెల్యే నేను ఉంటాం
రైతుల్లో ధైర్యం నింపే హరీష్ ప్రయత్నం
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
జహీరాబాద్ లోని న్యాల్కల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమం. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయ్యిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.ఆ రాయి ఇవ్వాలా జహీరాబాద్ రైతుల నెత్తిన పడింది.ఫార్మా సిటీ కోసం కెసీఆర్ గారు హైద్రాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల జాగ తయారు చేసిండు.
పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయి.సిఎం రేవంత్ రెడ్డి.. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా?


రంగారెడ్డిలో ఫార్మా సిటీ ఉన్నట్టా లేనట్టా అని హై కోర్టు అంటే ఉన్నది అని చెప్పింది. నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్ట్టేట్ చేయాలనే ప్లాన్ .న్యాలకల్ లో ఇక్కడి భూములు ఎంత బాగున్నాయ్. పచ్చగా పంటలు పండుతున్నాయి. మూడు పంటలతో సస్య శ్యామలంగా ఉంది. బంగారం వలె ఉన్న భూముల్లో ఫార్మా సిటీ ఏమిటి. 15 వేల ఎకరాల్లో పెట్టు. ఇక్కడ ఎందుకు పడ్డావు.
అక్కడ రియల్ ఎస్టేట్ చేసి, ఇక్కడ కంపెనీలు పెడుతావా?రైతుల ఉసురు పోసుకుంటున్నవు. మూసి ఉద్ధరణ ఇండ్లు కూల కొడుతున్నాడు.పేదల ఇల్లు కులగొట్టుడు, భూములు కొల్ల గొట్టుడు ఇదేనా ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ , గరీబి హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, గరీబోకో హటావో అంటున్నారు. ఇక్కడి ప్రజలు రెండు నెలల నుండి అన్నం తినడం లేదు. వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలు అన్నావు.ఇప్పుడు గుంజు కుంటా అన్నావు.రాహుల్ గాంధీ యాడున్నావ్. నువ్వే స్పందించు.పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు ఉన్న భూములు గుంజుతున్నరు.రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పు, మా పెదోల్ల భూముల తెరువుకు రావొద్దు.
ఓట్లు అయ్యాక డిల్లో కూర్చున్నాడు.రేవంత్ రెడ్డి రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా దిక్కు లేదు.
రుణమాఫీ కాలేదు.
బతుకమ్మ చీరలు రాలేదు.
తులం బంగారం వచ్చాయా
భూములు, దేవుళ్ళు గుంజుకుంటాడట


దేవుళ్ళ మీద ఒట్టు పెట్టీ ఆగష్టు నాటికి రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రజలను, దేవుళ్ళను మోసం చేసాడు.వంద రోజులు కాదు మూడు వందల రోజులు నిండాయి. ఇక్కడి రెండు వేల ఎకరాలు గుంజుకుంటే బి ఆర్ ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.జేసిబి, పోక్లెయిన్ వస్తె మీ ఎమ్మెల్యే, నేను అడ్డం పడతాము.మా మీద ఎక్కినంకనే మీ వద్దకు అవి రావాలి.గ్రీన్ ట్రిబ్యునల్, హై కోర్టులో కేసు వేస్తాం మీకోసం ఇక్కడి భూమిని పొనివ్వం. ఒక్క మాట మీద ఉండండి. ఎవడు వస్తాడో చూస్తా, ఎట్లా వస్తారో చూస్తా. కోహీర్ జామకాయలు, డపూరు పుదీనా కు ఫేమస్రే వంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. అక్కడే పెడుతా అని హై కోర్టుకు చెప్పినవ్. మళ్ళా ఇక్కడ ఎందుకు పెడుతున్నవ్
ఫార్మా సిటీలో ఫార్మా సిటీ పెట్టాలి లేదంటే అక్కడ కూడా భూములు వాపస్ ఇవ్వు. ఇక్కడ భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టకు,ఇందిరమ్మ రాజ్యం అంటే పెదల భూములు గుంజుతవా
మూసి శుద్ధి అంటున్నావ్. మంజీరను కరాబు చేస్తావా?
ఇక్కడి నాలుగు వాగులు, పెద్ద వాగు, చెరువులు, మంజీర కలుషితం అవుతాయి.మెదక్, హైద్రాబాద్ ప్రజలకు కలుషిత నీరు అందిస్తారా? పాల లాంటి మంజీరా నీళ్ళల్లో విషపు చుక్కలు కలుపుతవా.
చీకట్లో సంతకాలు పెట్టిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మోస పోకండి.
ఎవరు ఏడవకండి మీకోసం మేము కొట్లాడుతం.


మీరు ఐక్యంగా ఉండండి, మీకు అండగా ఉంటాం.రాళ్లు, రప్పలు ఉన్న భూములో ఫ్యాక్టరీలు పెట్టండి. ఇక్కడ కాదు.నేను, మాణిక్ రావు, ఇక్కడే ఉంటాం ఇక్కడే పడుకుంటాం జెసిబిలకు అడ్డంగా ఉంటాం. డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. సిఎం కావాలని అన్ని పార్టీలు మారి కాంగ్రెస్ లోకి దూకిండు.ధైర్యం కోల్పోవద్దు మొత్తం బి ఆర్ ఎస్ మీకు అండగా ఉంటుంది.అసెంబ్లీలో మీకోసం కొట్లడుతం.ఎవరన్నా వస్తె, ఒక్క ఫోన్ చేయండి రెండు గంటల్లో వస్తాం.తాత తండ్రికి ఇచ్చిన భూమి మీరు మీ పిల్లలకు ఇవ్వాలి.
రేవంత్ రెడ్డి గద్దలా తన్నుకు పోతా అంటే చూస్తూ ఊరుకోం
బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను కెసిఅర్ ప్రారంభించారు.
గోదావరి నీళ్లు మీకు ఇవ్వాలి అనుకున్నారు.కాంగ్రెస్ వచ్చాక పనులు ఆగిపోయాయి.
