ద్రోణ బోధన్
బోధన్ మండలం అమ్ధాపూర్, ఊట్ పల్లి, బెల్లల్, రాజీవ్ నగర్ తండా, సంగం, చుట్టు పక్కల గ్రామాలలో, నిన్న కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొత్తం వరి పంట నీట మునిగిపోయి రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లింది.


పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఒక పదిహేను, ఇరవై రోజులలో కోత కోసే ఈ సమయంలో భారీ గాలి వీచి,వర్షం కురిసి పంట పూర్తి గా నీట మునిగి పోవడం రైతులను ఆందోళనలలోకి నె టింది. రైతులు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కున్నట్టు అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇట్టి విషయాన్నీ గమనించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించ వలసినదిగా రైతులు కోరుతున్నారు.ఏదో కంటి తుడుపు చర్యగా సర్వే చేసి వదిలేయకుండా నిజంగా నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించవలసినదిగా రైతు లు కోరుతున్నారు.
