ఉదారతను చాటుకున్న మాజీ కోఆప్షన్ హాకీమ్
ద్రోణ కోటగిరి
గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం కరుణ చూపి సకాలంలో వారి జీతభత్యాలు చెల్లించడంతోపాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని మండల మాజీ కోఆప్షన్ సభ్యులు హకీమ్ డిమాండ్ చేశారు. మండలంలోని పోతంగల్ జల్లపల్లి గ్రామాల కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకొని దుస్తులను అందజేశారు. సామాజిక కార్యకర్త హకీమ్ చేస్తున్న సేవలకు పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కార్మికులు తమకు సుమారు నాలుగు నెలల నుంచి జీతం వస్తలేదని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వీడి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ్య కార్మికులు వ్యర్ధాలను తొలగించేందుకు కష్టపడితే వారి జీతాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఎందుకని ప్రశ్నించారు. జల్లపల్లి ఫారం పంచాయతీ కార్మికులకు సుమారు నాలుగు నెలల నుంచి జీతం వస్తలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి నెలసరి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని సామాజిక కార్యకర్త హామీ ఇచ్చారు. ఆయనతోపాటు నాయకులు మాజీ సర్పంచ్ శేరు, దేవ్ సింగ్, మాజీ ఎంపీటీసీ రాములు. సజ్జత్ తదితరులు ఉన్నారు.
