Sunday, February 15, 2026

ఝార్ఖండ్ బాలుడు కోటగిరీలో ప్రత్యక్షం

ద్రోణ కోటగిరి

తల్లిదండ్రులు మందలించడంతో మన స్థాపం చెందిన ఓ బాలుడు రైలు ఎక్కి పారిపోయి వచ్చాడు . జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వీర్ కుమార్ అనే 12 ఏళ్ల బాలుడు వారం రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి బోధన్ లో ప్రత్యక్షమయ్యాడు. జార్ఖండ్ నుంచి రైల్లో ప్రయాణిస్తూ బోధన్ కు చేరుకున్నాడు. గత ఆదివారం కూరగాయల మార్కెట్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలుడు తన వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. బాలల సంరక్షణ అధికారి చైతన్య కుమార్ బాలుని కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంపులో గల గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. వీర్ కుమార్ తన వివరాలు చెప్పటానికి మూడు రోజులు పట్టింది. వివరాలు తెలుసుకునే అధికారులు జార్ఖండ్ రాష్ట్రంలో నివాసముంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ బాలుడి ఆచూకీ లభించడంతో తల్లి సవితాదేవి తన బంధువులతో కలిసి నిజామాబాద్ కు శుక్రవారం చేరుకుంది.

బాలల సంరక్షణ అధికారులు గుమ్మడి ఫౌండేషన్కు తల్లిని తీసుకువచ్చి బాలుని అప్పగించారు. అధికారులు తమ బాలుని క్షేమంగా అప్పగించడంతో తల్లి బంధువులు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ సమితి చైర్మన్ సంపూర్ణ, ఫౌండేషన్ మేనేజర్ మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular