పోచారం, కాసుల సమిష్టి కాన్వాయ్
వర్గ పోరులో సత్తా చాటుకున్న పోచారం
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( TPCC ) అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటి సారి తన సొంత జిల్లా నిజామాబాద్ కు విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ

సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, మాజీ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తమ సత్తా చాటుకునే ప్రయత్నంలో విజయవంతం అయ్యారనే చెప్పుకోవచ్చు. పోచారం గత శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి బాన్సువాడ నియోజకవర్గం గెలుపొందారు.

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా చెప్పు కోనే రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించక తప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తమ ఊనికినే కోల్పోయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పావులు కదిపి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటి నుండి బాన్సువాడ నియోజకవర్గంలో వర్గ పోరు కొనసాగుతూనే ఉంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వర్గ పోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తమదంటే తమది అన్నట్టుగా ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు కొనసాగిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో గతంలో కాసుల బాలరాజు రెండు పర్యాయాలు తలపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో కాసుల బాలరాజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నో ఏళ్ల నుండి కాసుల బాలరాజు బాన్స్వాడ నియోజకవర్గంలో కష్ట నష్టాలను చవిచూశారు. పార్టీని నమ్ముకున్న కాసులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అభయం ఉండడంతో కార్పొరేషన్ చైర్మన్ వరించింది. బాన్సువాడలో వర్గపూర్ తారాస్థాయి కి చేరడంతో ప్రత్యర్ధులు అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం, కాసుల బాలరాజు చేతులు కలపక తప్పలేదు. ఇద్దరు కలయిక కొంతమందికి ఐ ఇష్టంగా ఉన్నప్పటికీ, మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, పోచారం అభిమానులు నియోజకవర్గంలో కలిసిపోయి పని చేసుకుంటున్నారు. ఇరు వర్గాల కలయిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సత్తాను చాటుకుని తమదే పై చేయిగా నిరూపించుకుంటున్నారు. నేటి నిజాంబాద్ కార్యక్రమానికి బాన్సువాడ నుండి భారీగా కార్యకర్తలు నిజాంబాద్ కు తీసుకెళ్లడంలో పై చేయిగా నిరూపించుకున్నారు.
మహేష్ కుమార్ గౌడ్ కి స్వాగతం పలకడానికి బాన్సువాడ నియోజకవర్గం నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున సుమారు 500 వాహనాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

బహిరంగ సభలో సబా వేధికపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ కి శాలువా,మెమోంటోతో సత్కరించారు.అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పోచారం ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపదాస్ మున్షీ , ఐటీ,పరిశ్రమలశాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ,దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వ్యవసాయ,సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రోడ్లు&భవనాల శాఖ మంత్రి కోమటిెరెడ్డి వెంకట్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ ,బోధన్ శాసన సభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ,జుక్కల్ శాసన సభ్యులు లక్ష్మి కాంత రావు , నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు భూపతి రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ , నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
