Sunday, February 15, 2026

భావిభారత ప్రధాని గా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యం

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం

టి పి సి సి చీప్ మహేష్ కుమార్ గౌడ్

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక పోరుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. టిపిసిసి అయిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం హైదరాబాదు నుండి సొంత జిల్లా అయిన నిజాంబాద్ కు విచ్చేశారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వేలాదిమంది రోడ్ల పైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించి పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి అందే విధంగా ప్రచారం చేయాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండి విజయం దిశగా వెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. వారి ఆరోపణలను పార్టీ కార్యకర్తలు, నాయకులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వము అమలు చేస్తుందని గుర్తు చేశారు.

రైతుల రుణమాఫీ విషయంలో కొన్ని సాంకేతిక లోపాలు ఏర్పడినట్లు చెప్పారు. 2 లక్షల లోపు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందుకోసం పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం త్వరలోనే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పటివరకు రైతులు సంయమానం పాటించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ

గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని లక్షల కోట్ల సొమ్ము చేసుకున్నారని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి కాలేశ్వరం నీరు తేవడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువా పుష్ప గుచ్చాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్,ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి, నరాల రత్నాకర్, సాయి రెడ్డి, అన్వేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ రావు, మాజీ ప్రభుత్వ విప్ యూసుఫ్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలియాస్, ఎడ్ల రాజిరెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, గోనె శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, పరిదీపెట్ రమేష్ గౌడ్, కోయల్కర్ కన్నయ్య, గుడుగుల శ్రీనివాస్, ఐరేని సందీప్, చిన్న మల్లారెడ్డి రాజా గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular