ద్రోణ బాన్సువాడ
బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ మెడికల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ ను ప్రారంభించిన తెలంగాణ ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, శంభు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెడికల్ యాజమాన్యం కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్ , కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేక్ , ఎజాస్ ,అంజి రెడ్డి , కృష్ణ రెడ్డి , గుడాల నగేష్ , హకీమ్ , మధు సూదన్ రెడ్డి ,ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.
