Sunday, February 15, 2026

ఏపీ సీఎం ను కలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి శుభలేఖను అందించి ఆహ్వానించారు. చంద్రబాబును కలిసిన వారిలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు ని కలవడంతో పలు రకాలు చర్చలు కొనసాగుతున్నాయి. ఎప్పటినుండో మల్లారెడ్డి తిరిగి మళ్లీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. మరొక తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచారాన్ని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయ చర్చలకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular