ద్రోణ ఎలారెడ్డి
కామారెడ్డి జిల్లా గాంధారి మార్కెట్ కమిటీ అధ్యక్షులు వారి పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
గాంధారి టౌన్ లో గల మారుతీ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ నందు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ & ఎంపీ సురేష్ శేట్కార్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ & డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం హట్టసంగా నిర్వహించారు.


గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్ & వైస్ చైర్మన్ గా ఆకుల లక్ష్మణ్ గాంధారి మండలాలకు చెందిన నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన మాట్లాడుతూ ముందుగా గాంధారి మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన రైతులకు, అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ కి డైరెక్టర్లకు అభినందనలు వీరి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెంది రాష్ట్రంలోని ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటున్నాను అనీ వ్యక్తం చేశారు.కొద్దీ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను కార్యకర్తలే ఎమ్మెల్యే లు గా మారి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలి. ప్రజలకు పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించాలి. రుణమాఫీ పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి రుణ మాఫీ వస్తుంది. గాంధారి మండలానికి క్రీడా మైదానం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 యేండ్లు పరిపాలించిన కారు పార్టీ గాంధారి మండలం కోసం ఏం చేసింది ?నాయకులు సంపాదించుకోవడం తప్ప మండలాన్ని అభివృద్ధి చేయలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి తక్కువ కాలం లోనే బుగ్గ గండి వద్ద ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. కాటేవాడి రోడ్డు, కర్ణం గడ్డ తండా రోడ్డు, ముఖ్యంగా గాంధారి మండలం పంటలతో కళకళలడాలని కాటేవాడి, గుజ్జుల్ (పాకేజీ 22) పూర్తి కావాలని నిత్యం శ్రమిస్తున్నాను. మొన్నటికి మొన్న సర్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే నా నెల జీతాన్ని ఇచ్చి వారికి ఇల్లు కట్టిస్తున్నాను. అది గిట్టని కొందరు దద్దమ్మలు కాకి కూతలు కూస్తున్నారు. గాంధారి మండలం లో ఉన్న కాయితీ మరియు st సోదరులకు మంచి పదవులు ఇప్పిచ్చే బాధ్యత తీసుకుంటాను. త్వరలోనే గాంధారి మండల కేంద్రంలో 40 లక్షలతో సీసీ, డ్రైనేజీ పనులను ప్రారంభించబోతున్నాం. అందరూ నాయకులు కలిసి కట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
