ద్రోణ బాన్సువాడ
చేప పిల్లల నాణ్యతలో ఎంతో వ్యత్యాసం ఉందని, ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధిపరిచేందుకు పౌష్టికాహారాన్ని ప్రజలకు అందించేందుకు ఎన్నో కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుందని దళారులు మాత్రం తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో మంగళవారం చేప పిల్లల విత్తనాలు విడుదల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు దళారుల నుండి విముక్తి చేయడానికి ప్రభుత్వము 100% ఉచిత చేప పిల్లలను అందజేస్తుందని ఈ అవకాశాన్ని మత్స్యకార కులస్తులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేప పిల్లల నిబంధనలు పాటించకపోతే ఏజెన్సీలు రద్దు చేసేందుకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో 26 వేల చెరువుల్లో సబ్సిడీ చేపలను పంపించడం జరుగుతుందని ఈ సబ్సిడీ చేపలను ప్రారంభించింది తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే చేశానని గుర్తు చేశారు. చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిందని పోచారం తెలిపారు. మత్స్యకారులు స్థానికంగా కాకుండా ఇతర చోట్లకి వెళ్లి అమ్ముకునే విధంగా వాహనాలను, తెప్పలను, వలలు, ఆటోలను, పంపిణీ చేసినట్లు పోచారం వివరించారు. ప్రభుత్వము అందిస్తున్న ఉచిత సబ్సిడీ చేప పిల్లలను చెరువుల్లో వేసి మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో ప్రభుత్వ ఉచిత సబ్సిడీ చేప పిల్లల విత్తనాన్ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, యఫ్ డివో శ్రీపతి, నాయకులు అంజిరెడ్డి, ఎజాస్, నార్ల రవీందర్, నార్ల సురేష్, అలిమొద్దీన్ బాబా, యం.డి. దావూద్, నార్ల ఉదయ్, దాసరి శ్రీనివాస్, శ్రావణ్, అఫ్రోజ్, మున్సిపల్ కౌన్సిలర్లు హకీమ్, రఫీక్, కిరణ్, వెంకటేష్, నర్సగొండ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మృత్స్య శాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
