ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-

నిజామాబాద్ లో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్య అతిథులుగా అందెల రవళి, నిజామాబాద్ అర్బన్ శాసనస భ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందెల రవళి నాట్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నాట్యో పాసన కార్యక్రమానికి విచ్చేసిన నాట్య గురువు సాయి రవళి వ్యాప్తికి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.


ప్రసిద్ధి నర్తకి మనీ నాట్య గురువు వెంపటి ప్రియాంక వంటి వారిని ఆహ్వానించడం అభినందనీయమని అన్నారు. వీరు సికింద్రాబాద్ సంగీత కృత్య కళాశాల నడుపుతూ రవీందర్ రాజు సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపాల్, దేవులపల్లి ప్రశాంత్ కుమార్ కూచిపూడి విభాగములో, హెచ్ ఓ డి భక్త రామదాసు లుగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సూరి, రామ్మోహన్ రావు, జేయిని నెహ్రూ, రామ్మోహన్ రావు, వెంపటి ప్రియాంక, వెనిగళ్ళ సురేష్,ఘణపురం దేవేందర్, రమణాచారి , అందెల రవళి నాట్యాలయం నిర్వాహకులు సాయి రవళి, అనంత నాగలక్ష్మి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
