Sunday, February 15, 2026

పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను కట్టిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గంధం వారి గూడెం వద్ద 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పైలన్ ఆవిష్కరించి ,ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంగ్లీష్ ,తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ పాఠశాలల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు. ఈ పాఠశాలల్లో చదువుతోపాటు ,అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు. 5000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

నల్లగొండలో చేపట్టిన ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు .పేదవానికి చదువు చెప్పిస్తేనే కుటుంబంతో పాటు, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని, అందువల్ల పేదలందరూ తమ పిల్లలను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. 25 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ పాఠశాలలను చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు .తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ,త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని చెప్పారు.రైతుల సంక్షేమంలో భాగంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగిందని, రెండు లక్షల కన్నా మించి రుణాలు ఉన్నవారి రుణాలు కూడా త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో పేదవారికి, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడమే తన ధ్యేయమని అన్నారు. జిల్లాలో ఎస్.ఎల్.బి.సి సొరంగం ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించేందుకుగాను ఎస్.ఎల్.బి.సి టన్నల్ మిషన్ విడిభాగాలను అమెరికా నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నామని, ఎస్ ఎల్ బిసి ద్వారా శ్రీశైలంలో డెడ్ స్టోరేజీలో నీరున్నప్పటికీ సైతం నల్లగొండ జిల్లాకు సాగునీరు అందుతుందని తెలిపారు.

గత సంవత్సరం కరువు కారణంగా జిల్లాలో పంటలు పండలేదని, ఎస్ఎల్బీసీ పూర్తయితే రెండు సంవత్సరాలలో 4 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని మంత్రి వెల్లడించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల ద్వారా నీరు వదిలినప్పటికీ కాలువలలో చెట్లు, ముళ్ళపదలు, పూడిక కారణంగా చివరి వరకు సాగునీరు అందదన్న ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి కాలువల్లో మరమ్మతులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కృష్ణా నీటితో జిల్లాలోనిప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్ళు కడిగినప్పుడే తన కల నెరవేరుతుందని అన్నారు.బ్రాహ్మణ వెళ్ళాంల ద్వారా సాగునీరు ఇచ్చేందుకుఇటీవలే 25 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు . నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన మెడికల్ కళాశాల పూర్తి చేసేందుకు 45 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, పనులు పూర్తయ్యాయని, నవంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రభుత్వ వై ద్య కళాశాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇండ్లు లేని పేదవారికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ,రానున్న నాలుగున్నర సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా ,అన్ని ప్రభుత్వ అభివృద్ధి పథకాలను అందిస్తామని తెలిపారు. 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామని, ప్రజలే తన ప్రాణమని మంత్రి వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలు పేద విద్యార్థులకు ఒక గొప్ప వరం అని అన్నారు.
మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవచ్చు అని, 2014 ముందు నల్లగొండ లో ఎలాంటి అభివృద్ధిని చూడలేదని , తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కోట్ల రూపాయల వ్యయంతో జూనియర్ కళాశాలను కట్టించడమే కాకుండా, 3 కోట్ల రూపాయలతో బొట్టు గూడా ఉన్నత పాఠశాల నిర్మాణానికి నిధులు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనార్టీ పిల్లలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను, ప్రామాణిక విద్యను పొందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 20నుండి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈ పాఠశాలలను చేపట్టడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో నల్లగొండ ,మునుగోడు నియోజకవర్గాలలో మొదటి విడతన ఈ పాఠశాలల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని వెల్లడించారు. పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చదివే స్తోమత ఉండదని అన్నారు.
రోడ్లు,భవనాల శాఖ సూపరింటిండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి, డి ఈ గణేష్, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular