కల్లుగీత కార్మికులకు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు హరీష్ బాబు
ద్రోణ కాగజ్ నగర్
కాగజ్ నగర్ పట్టణంలోని గౌడ సంఘం ఆవరణలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాటమయ్య రక్షా కిట్ల పంపిణీ కార్యక్రమానికి సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రభుత్వం అందిస్తున్న కిట్లను కార్మికులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తుల కోసం ఈ కిట్లను తయారు చేయించిందని, కల్లుగీత కార్మికులు తప్పకుండా ఈ కిట్లను ధరించిన తర్వాతే తాటి చెట్టు ఎక్కాలని సూచించారు.


అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పై అసెంబ్లీలో మాట్లాడుతానని,సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్, బీసీ కార్పొరేషన్ ఈడి సజీవన్, ఎక్సైజ్ సీఐ రవి, జిల్లా మోకు దెబ్బ అధ్యక్షులు కొండ్ర మనోహర్ గౌడ్, రామా గౌడ్ ,సురువు శంకర్ గౌడ్, నరహరి గౌడ్, జక్కుల సత్యనారాయణ గౌడ్, మురళి గౌడ్, మల్లేష్ గౌడ్, కొంగ సత్యనారాయణ, దూసరి శివ గౌడ్,తిరుపతి గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
