Sunday, February 15, 2026

విజయవంతం గా విద్యుత్ ఉత్పత్తి కేద్రం ప్రారంభం

ద్రోణ ఖమ్మం ప్రతినిధి

అశ్వారావుపేట మండలం
నారంవారిగూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మించిన 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విద్యుత్ ఆర్ధిక ప్రణాళిక శాఖల మంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ కో ఆపరేటివ్ టెక్ టైల్స్ & హ్యాండ్లుమ్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ పౌర సంబందాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా అట్టహసంగా ప్రారంభంచేశారు.
తెలుగురాష్ట్రాల పామాయిల్ సాగు రైతులకు నిర్వహించిన అవగాహనా సదస్సులో రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అవలంభిస్తున్న విధానాలను చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడుల కోసం తీసుకోవాలి జాగ్రత్తలు అంతర పంటల సాగు వ్యవసాయంలో వినూత్న పంటలపై అవగాహన, ఆయిల్ ఫామ్ మద్దతు ధర కోసం చేయవలసిన కృషి , నూతనంగా సాగుచేసే రైతులకు ప్రభుత్వ రాయితీలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular