Sunday, February 15, 2026

ముఖ్యమంత్రి రాకతో మురిసిపోయిన కొండారెడ్డిపల్లి

పలు అభివృద్ధి పనులు ప్రారంభం, పలు శంకుస్థాపనలు

స్వగ్రామం రూపురేఖలు మార్చిన రేవంత్

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకోవడంలో గ్రామమంతా మురిసిపోయింది. గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామానికి చెందిన వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకుంటే ఆ గ్రామ మరియు ప్రజల స్థితిగతులను మారుతాయి అన్న పదానికి నిదర్శనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో నిరూపించి తీరారు. ప్రతి ఏడాది దసరా పర్వదినం రోజు ఆయన స్వగ్రామానికి వెళ్లడం ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారం నేడు ముఖ్యమంత్రి అయినప్పటికీ దసరా సందర్భంగా శనివారం కొండారెడ్డిపల్లికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.
రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.
రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.
రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి , శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ , కసిరెడ్డి నారాయణ రెడ్డి , కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular