Sunday, February 15, 2026

ప్రొఫెసర్ సాయిబాబు కి సిపిఎం సంతాపం

ద్రోణ నిజామాబాద్

ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసిన సాయిబాబా ఇటీవలన అనారోగ్యానికి గురై హాస్పటల్లో ప్రాణాలు వదిన సందర్భంగా ఆయన మృతికి సిపిఎం నిజాంబాద్ జిల్లా కమిటీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా పేద కుటుంబంలో జన్మించినప్పటికీ. వైకల్యం రావటంతో ఏమాత్రం వెనకడుగు వేయకుండా చదువులు చదివి ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజా పరిపాలన కావాలని ఈ వ్యవస్థ మారాలని అనేక వ్యాసాలను ఉపన్యాసాలను అందించడం జరిగిందన్నారు. చివరి వరకు ప్రజల కోసం పరితపించిన వ్యక్తి సాయిబాబా అని ఆయన ఆలోచనలను ,మేధస్సును నాలుగు గోడల మధ్య బందీ చేస్తూ అంగవైకల్యాన్ని కూడా ఆలోచించకుండా నక్సలైట్లకు ఉన్నారని పేరుతో అనేక సంవత్సరాల పాటు జైలుకు చేయటంతో పాటు ఆయనకు ఆరోగ్య సమస్యలను సృష్టించిన ఈ రాజ్యం ఆయన మరణానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇటీవలనే సుప్రీంకోర్టు ఆయనకు నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ. ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వాటి మూలంగానే ప్రొఫెసర్ సాయిబాబు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సాయిబాబా మృతికి సిపిఎం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular