ద్రోణ బాన్సువాడ
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు కొంతమేర ఓపిక పట్టి పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించడం ఎంతో మేలు కలుగుతుందని ప్రభుత్వ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పోచారం కాసుల బాలరాజు తో కలిసి ప్రారంభించారు.బాన్సువాడ పట్టణంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఈ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని పోచారం కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్ ,సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి , మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖలేక్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ , అంజి రెడ్డి , గోపాల్ రెడ్డి ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు నార్ల సురేష్ , నార్ల రవీందర్ , ఎజాస్ , గుడల నగేష్ , ఎజాస్ , షాహబ్ , మోహన్ నాయక్ , శ్రీధర్ , వెంకన్న , కొట్టం గంగాధర్ , డైరెక్టర్ సాయలు , లింగం , గౌస్ , నర్సుగొండ , తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
