Sunday, February 15, 2026

సన్న రకం ధాన్యానికి 500 బోనస్

ద్రోణ బాన్సువాడ:-

రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేపట్టుకోవాలని పోచారం సూచన

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నీ
నసురుల్లాబాద్ మండల కేంద్రములో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు.

కోటి 43లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన 12 లక్షల రూపాయలతో నసురుల్లాబాద్ ప్రధాన రహదారి నుండి మండల కేంద్రము వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

7 లక్షల రూపాయలతో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.అనంతరం నసురుల్లాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు.

అని రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వాన కాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ,ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్నం రకం దాన్యాన్నికి ప్రోత్సహకంగా క్వింటాలుకు 500/- బోనస్ ఇవ్వడం జరుగుతుంది, రైతులు సద్వినియోగ పరచుకోవాలని, రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదు.

అని ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2320/- రూపాయలకు,కామన్ గ్రేడ్ 2300/- రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతులు శుభ్రం చేసి తాలు లేకుండా,తేమ 17% లోపు ఉండేల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular