ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
ప్రభుత్వం నూతనంగా నియమించిన యువ ఇంజనీర్లు పనుల విషయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వంతో పాటు మీ కుటుంబాలకు పేరు ప్రతిష్టలు సంపాదించాలని మంత్రి సీతక్క సూచించారు.


బంజారాహిల్స్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న A E E లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.

శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించిన మంత్రి సీతక్క

నూతనంగా నియమితులైన A E E లకు అభినందనలు తెలిపారు.అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలి, మీ పని తనమే మీకు గుర్తింపు తెచ్చిపెడుతుందనీ,నాణ్యత పై ఎక్కడ రాజీ పడొద్దు అని మంత్రి ఇంజనీర్లకు సూచించారు.

శాశ్వతంగా నిలిచిపోయేలా మీ పనులు ఉండాలి.మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి తెచ్చి పెట్టేలా పనులు చేయాలన్నారు.
