ద్రోణ హైదరాబాద్:అక్టోబర్ 15
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈరోజు ఘన నివాళులు అర్పించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలాం చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.


ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొని కలాంకు నివాళులు అర్పించారు.
