Sunday, February 15, 2026

మద్దతు ధర, డబ్బుకు రక్షణ కొనుగోలు కేంద్రాలతోనే సాధ్యం

రుద్రూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు

ద్రోణ రుద్రూర్

రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు డబ్బుకు రక్షణ ఉంటుందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ సొసైటీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కాసుల బాలరాజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ చెల్లించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి బోనస్ పొందాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమములో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్,మండల అధ్యక్షులు తోట అరుణ్ , సొసైటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ , మాజీ జెడ్పిటిసి గంగారాం ,సొసైటీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి , శ్రీధర్ , గంగుల గంగాధర్ , నియోజక వర్గ అధ్యక్షులు మధుసుధాన్ రెడ్డి , వెంకన్న , డైరెక్టర్లు పార్వతి ప్రవీణ్ , అహ్మద్ ,సంతోష్ , కార్తీక్ , కార్కే అశోక్ ,షాహబ్ , ఖమ్రూ , నిసార్ తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular