రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్
ద్రోణ బాన్సువాడ
ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం బీర్కూర్ మండలంలోని బైరాపూర్ సొసైటీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులను ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, రైతులు గతంలో ఎన్నడు లేనివిధంగా రుణమాఫీ జరిగిందనే సంగతి తెలుసుకోవాలన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని విడతలవారీగా రుణమాఫీ చేసినప్పటికీ, కొంతమంది రైతులకు బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ తేడాల వల్ల కొద్దిగా ఆలస్యమైందని త్వరలోనే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బోయిని శంకర్ ,సొసైటీ చైర్మన్ కృష్ణరెడ్డి, సొసైటీ వైస్ చైర్మెన్ సాయి శ్యామ్,మాజీ ఎంపీపీ లు రఘు , విజయ్ ప్రకాష్ ,హన్మంత్ రావు, మొగల్గొండ , విజయ్ పటేల్, లక్ష్మయ్య, , యమా రాములు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కొట్టం గంగాధర్, అందే రమేష్,తదితరులు పాల్గొన్నారు.
