నిజామాబాద్ జిల్లా సాలురా మండలం హుంన్సా ప్రభుత్వ పాఠశాలకు ఇటీవల నూతనంగా ఉద్యోగం సాధించి పోస్టింగ్ పై వచ్చిన ఇద్దరు యువ ఉపాధ్యాయులను మరియు బదిలీపై వచ్చిన మరో ఉపాధ్యాయుడిని గ్రామస్థులు సన్మానించారు. ఇదివరకే ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గోవర్ధన్ రాష్ట్ర పీఆర్టీయూ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయనను కూడా గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిల శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామస్తులు సమ్మి శంకర్, ఈరాయప్ప, నరేందర్, హనుమంతు, శివకుమార్, శిఖరి నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హుంన్సా ప్రభుత్వ పాఠశాల యువ ఉపాధ్యాయులకు సన్మానం
RELATED ARTICLES
