ద్రోణ హనుమకొండ
సామాన్య ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో మానవతా విలువలు పెంపొందటానికి దోహదం చేసిన మహోన్నతుడు వాల్మీకి మహర్షి అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.


మడికొండ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి ఎంపీ డాక్టర్ కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రామాయణం లాంటి మహా కావ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని తెలిపారు. ఒక కుటుంబం లో ఉన్న ప్రతీ ఒక్కరి మధ్య సంబంధాలను గొప్పగా తన కావ్యం ద్వారా మనకు అందించారాని అన్నారు. అలాంటి మహనీయులను పూజించుకోవడం, స్మరించుకోవడం తో పాటు మహనీయుల చరిత్రను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలొని మహనీయుల చరిత్ర మరుగున పడిందని, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వారికీ సమూచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. వాల్మీకి బోయ కులస్తుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బోయ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
