ద్రోణ ఆదిలాబాద్ ప్రతినిధి
రాహుల్ గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఇందిర ఫెలోషిప్ బూట్ క్యాంప్ వర్క్ షాప్ లో పాల్గొననున్న సుగుణక్క.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ,ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగే ఇందిర ఫెలోషిప్ బూట్ క్యాంప్ వర్క్ షాప్ లో పాల్గొనటానికి తెలంగాణ నుంచి రాష్ట్ర యూనిట్ ఇంచార్జ్ సౌజన్య తో పాటు ఆత్రం సుగుణక్క పాల్గొంటారు.శక్తి అభియాన్లో భాగంగా ఉమెన్ ఎంప వరింగ్, ట్రాన్స్ఫార్మింగ్ పాలిటిక్స్ అనే లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ అనే సంస్థని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని సుగుణక్క అన్నారు.ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇందిర ఫెలోషిప్ యూనిట్ ఇంచార్జ్ లు పాల్గొంటారని తెలిపారు.
