పాలకుర్తి ఎమ్మెల్యే రైతులకు సూచన
ద్రోణ పాలకుర్తి ప్రతినిధి
పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలోని అన్నదాతల ఆర్థిక అభివృద్ధియే లక్ష్యంగా ఐకేపీ ప్రభుత్వ కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన *స్థానిక పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు హనుమాoడ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి, మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ డా,,సత్య శారదా మరియు అడిషనల్ కలెక్టర్ సంధ్య రాణి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు, రైతులకు ఆనాడు లక్ష రుణమాఫీ,నేడు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానీదే అని,భారతదేశానికే అన్నం పెట్టే ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రo మారుతుందని తెలిపారు,ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి తీరుతామన్నారు.
