Sunday, February 15, 2026

పేదలకు వైద్య సౌకర్యాలు కల్పించాలి

ద్రోణ వరంగల్ ప్రతినిధి

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వరంగల్ జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం సమావేశంలో పాల్గొని పలు శాఖలకు అధికారులకు పలు సూచనలు సలహాలు చేసి అలాగే నా నియోజకవర్గం లోని విలీన గ్రామం 14వ డివిజన్ ఎనుమాముల లో నిరుపేదల ప్రజలు మార్కెట్ లో కూలీనాలి చేసుకుంటున్నారు. వారు ప్రైవేట్ వైద్యం చేసుకోలేనివారు వారి కోసం ప్రాథమిక చికిత్స కోసం బస్తీ దావఖాన ఏర్పాటు చేయాలని కలెక్టర్ కి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపి పొరిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular