ద్రోణ నకిరేకల్
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి మద్దతు ధరను పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రైతులకు సూచించారు.శుక్రవారం నార్కెట్‌పల్లి మండలంలోని ఏపి లింగోటం, నార్కెట్‌పల్లి పట్టణం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో


ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
