Saturday, February 14, 2026

పోచారానికి రుణపడి ఉంటాం

పోచారానికి సన్మానం చేసిన
బస్వాపూర్, అడ్కాస్ పల్లి గ్రామస్తులు

వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామాలకు చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని, వారి సేవలకు రుణపడి ఉంటామని, వారి రుణాన్ని ఓట్ల రూపంలో అందించి తీర్చుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడకాస్ పల్లి, బస్వాపూర్ గ్రామ పెద్దలు శుక్రవారం పోచారం స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గ్రామానికి సంబంధించిన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన పోచారానికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

తమ గ్రామం నుండి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు 25 లక్షల రూపాయల నిధులను సి ఆర్ ఆర్ నుండి మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనాటి నుండి నేటి వరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ గ్రామాలకు ఎనలేని కృషి చేశారని ఆయన కృషిని ఎన్నటికీ గ్రామస్తులం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల గురించి పోచారం దృష్టికి తీసుకువెళ్లారు. ఇళ్ళ పంపిణీలో ఉన్న ఇబ్బందులను తొలగించి న్యాయం చేస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి ఎటువంటి సహకారాన్ని అయినా అందిస్తానని గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. పోచారం ను కలిసిన వారిలో తాజా మాజీ ఉపసర్పంచ్ పుట్ట శ్రీధర్ బాబు, తాజా మాజీ సర్పంచ్ రెడ్డి రామకృష్ణ, కోలి వినోద్, పెనిమర్తి పట్టాభి, షేక్ జాకీర్, పుష్ప రాజ్, వల్లూరి గణేష్, యాద్గార్ పూర్ మాజీ సర్పంచ్ కృష్ణ కుమార్, గైని మోహన్, ముత్యాల జవహర్, సాయి ప్రసాద్ వారితోపాటు గ్రామస్తులు పలువురు ఉన్నారు.

కాసులకు సన్మానం

తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా ఇరు గ్రామాల పెద్దలు కలిశారు. తమ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న కాసులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఇప్పటివరకు అందించిన తోడ్పాటును ఎన్నటికీ మరువలేమన్నారు. గ్రామస్తులు కాసులకు సన్మానం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular