Saturday, February 14, 2026

మధ్య నిషేధానికి శ్రీకారం చుట్టిన దేశాయిపేట్

ద్రోణ కామారెడ్డి:-

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని దేశాయిపేట గ్రామస్తులు మధ్య నిషేధానికి శ్రీకారం చుట్టారు. మద్యం సేవించడం వల్ల గ్రామాల్లోని ఎంతోమంది నిరుపేదలు రోడ్డున పడటంతో పాటు అనారోగ్య పాలవుతున్నారని ఆర్థికంగా కూరుకుపోతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడ మండల పరిధిలోని దేశాయిపేట గ్రామంలో శనివారం మద్యం నిషేధం ఏకగ్రీవ తీర్మానం చేశారు. దేశాయిపెట్ గ్రామంలో గ్రామ పెద్దలు ,యువకుల సమక్షంలో మద్యం నిషేదం నిర్ణయించడం జరిగింది. కామారెడ్డి జిల్లా లో మన గ్రామం ఆదర్శ వంతం గా నిలవాలని గ్రామ పెద్దలు, యువకులు తీర్మానించారు. ఈ మధ్యం నిషేధం సోమవారం ఈనెల 21 ఉదయం 6; 00 నుండి మద్యం నిషేదం అమలు చేయడం జరుగుతుందని వారు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రామ పెద్దలు ప్రజల తీర్మానానికి వ్యతిరేకంగా కాదని ఎవరైనా మద్యం అమ్మిన చో వారికి 50 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పరచడంతో గ్రామాల్లో మంచినీరుల మద్యం ప్రవహిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు గ్రామంలో చేపడితే ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. విషయాన్ని గ్రామస్తులు అందరూ దృష్టిలో పెట్టు కోవాల్సింది గా గ్రామ పెద్దలు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బోనేకర్ ప్రకాష్, మాజీ సర్పంచులు విట్టల్, రేంజర్ల సాయ గౌడ్, మాజీ ఎంపిటిసి గాండ్ల వెంకటరమణ, పెంటల పోశయ్య, బీరప్ప, పండరి గౌడ్, బాబురావు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular