కేటీఆర్ డిమాండ్. రైతుల పక్షాన పోరాడే తీరుతాం
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసింది.
వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసింది. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టింది.
రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగింది. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారు.
మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారు.
ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. కే సీ ఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు…మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా? పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను దగా చేశావ్. నీ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నావ్. రైతులతో చెలగాటమాడితే మాడి మసి అవక తప్పదు. రుణమాఫీ మోసం చాలదన్నట్లు ఇప్పుడు రైతు భరోసాలోనూ దగానే. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తాం. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదు.
