Saturday, February 14, 2026

ఖరీఫ్ ధాన్యం దళారుల పాలు

మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ద్రోణ హైదరాబాద్

రైతురుణమాఫీ పూర్తి చేయలేదు.రైతుబంధు కు రాం రాం చెప్పారు.గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ఊసేలేదు.
ధాన్యం అమ్మిన డబ్బులు ఇస్తారో లేదోననే అపనమ్మకంతో రైతులు దళారులకు ధాన్యం అమ్ముతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంట మండలంలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటన చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చుడే తప్ప అమలు చేసేదేమీ లేదని,రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని అధికారంలోకి రాగానే రైతుభరోసా ద్వారా ఎకరాకు ₹15000లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతులకు నయాపైసా ఇవ్వలేదని

మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
శనివారం ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ, రహీంఖాన్ పేట,ఇల్లంతకుంట, పత్తికుంటపల్లి, గాలిపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులకు నమ్మకం లేకనే దళారులకు అమ్ముకుంటున్నారని, రైతుబంధు ఇవ్వడం లేదు, రైతు రుణమాఫీ లేదు.

ఇక ధాన్యం అమ్ముకుంటే డబ్బులు కూడా ఇస్తారో లేదోననే అపనమ్మకంతో రైతులు ఉన్నారని,ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందడుగు వేయడం లేదని విమర్శించారు.మట్టి తల్లిని నమ్ముకుని ,చెమటోడ్చి పంట పండిస్తే ప్రభుత్వం రైతులకు అండగా నిలవకపోవడంతో చివరకు దళారులు చెప్పిన ధరకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు.
అకాల వర్షాల కారణంగా ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయని, రైతులు కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయిందని.అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.ఏ ఊరుకు పోయిన రైతులు మా బ్రతుకులు ఇలా అయ్యాయి సారూ…కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు మాకు డోకా లేకుండే ఇప్పుడు మళ్లీ మా బ్రతుకులు ఆగమవుతున్నాయని రైతులు అరిగోసపడుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా రైతుల నుంచి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి,డబ్బులు చెల్లించాలని, రైతురుణమాఫీ పూర్తి చేయడంతో పాటు, రైతుభరోసా ద్వారా ఎకరాకు₹15000లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎండ్ర చందన్, బాలకిషన్, రాములు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular