Sunday, February 15, 2026

రైతుబంధు ఇచ్చి తీరాల్సిందే

ద్రోణ నిజామాబాద్

శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరాలని, రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు బంద్ రైతులకు పెంచి మరింత ఆదరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ప్రస్తుతం ఇచ్చేది లేదని ప్రకటన చేయడం సరైన చర్య కాదని రైతులకు రైతుబంధు ఇచ్చి తీరాల్సిందేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు.
నిజాంబాద్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి రమేష్ బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ డిసెంబర్ నెల నుండి రైతులకు రైతు భరోసా 15000 అందజేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావువచ్చే వానాకాలం పంట నుండి రైతు భరోసాను అమలు జరపటానికి ఆలోచిస్తామని ప్రకటించటం అంటే రైతులను మోసం చేయటమే అవుతుందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాని వెంటనే ప్రకటించాలని అదేవిధంగా రైతులు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ ధరను ఇవ్వాలని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు సర్పంచ్ యెడల రైతాంగం కూలీలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular