త్వరలో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
ద్రోణ కామారెడ్డి జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, రాష్ట్ర ఖజానాన్ని గులాబీ దళపత్తులు జేబులు నింపుకున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి పదవి ప్రమాణస్వీకారా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆర్థికంగా లూటీ చేసిందన్నారు. వారి ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దన్నారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని గ్రాడ్యుయేట్ లందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఓటు వేయవలసిన అవసరం వచ్చిందన్నారు. రాష్ట్రంలో మరో నాలుగు లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతు భరోసా విషయంలో పంట భూముల ప్రక్షాళన జరుగుతున్నందున కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. గడిచిన 15ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం పాలనలో చేసిన లూటీని గ్రాడ్యుయేట్లు గమనించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా బి.ఆర్.ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని విద్యార్థి సంఘం నుండి వచ్చిన చంద్రకాంత్ రెడ్డి కి నేడు జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవి ఇచ్చామని అన్నారు. ప్రజలకైనా పార్టీ కార్యకర్త కైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకమని భరోసా అన్నారు. దోమకొండలో త్వరలో 100 పడకల ఆసుపత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇల్లు లేని నిరుపేదల కోసం మొదటి విడతగా 3500 ఇండ్లు కట్టిస్తామన్నారు. రైతు భరోసా రాలేదని బి ఆర్ ఎస్ నాయకులు ఆరోపించారు. నిజమైన రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ సెట్ కార్, కార్పొరేషన్ చైర్మన్లు తహేర్ బిన్ హుందాన్, మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుభాష్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పండ్ల రాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
