Saturday, February 14, 2026

కోటపాటి ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వం

ద్రోణ ఆర్మూర్ ప్రతినిధి

ఆర్మూర్ మండలంలోని చేపూర్, హరిపూర్ గ్రామాలలో బిజెపి సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు ఆధ్వర్యంలో మూడు రోజులుగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. చేపూర్, హరిపూర్ గ్రామ నాయకులు ఎస్ రుక్మాజి, మాజీ ఎంపీటీసీ బాల్ నర్సయ్య మరియు డాక్టర్ పిల్లి సత్యనారాయణ సహకారంతో మూడు రోజులలో 125 మంది సభ్యులను చేర్పించడం జరిగింది. దీంతో కోటపాటికి క్రియాశీల సభ్యత్వానికి అర్హత లభించింది. ఆయా గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికై ప్రజలు బీజేపీ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. మోదీ ప్రధాన మంత్రిగా పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అందించడం ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి చేస్తున్న కృషి , దేశభద్రత, తదితర విషయాలపై సానుకూలంగా ఉన్న ప్రజలు బిజెపి సభ్యులుగా చేరి తమ మద్దతు తెలుపు చున్నారని కోటపాటి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular