Friday, February 13, 2026

న్యాయమూర్తులకు గృహ సముదాయంకు శంకుస్థాపన


ద్రోణ బోధన్:-

బోధన్ పనిచేస్తున్న న్యాయమూర్తులకు గృహ వసతి కల్పనలో భాగంగా నిర్మిచనున్న భవనాలకు సోమవారం రోజు ఆన్లైన్ పద్దతిలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేందర్,జస్టిస్ అలి శెట్టి లక్ష్మీ నారాయణ లు ముఖ్య అతిధులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు.కార్యాక్రమ వీక్షణ కోసం బోధన్ ఆదనపు జిల్లా జడ్జి కోర్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు లు చేశారు.

కార్యక్రమంలో లో జిల్లా జడ్జి కుంచాల సునీత అతిథులను ఆహ్వానించి భవన నిర్మాణ కార్యక్రమాలను వివరించారు అనంతరం రాకాశి పేట లో గల నిర్మాణ స్థలంలో స్థానిక న్యాయమూర్తుల ఆధ్వర్యంలో భూమిపూజ నివ్వహించి సంప్రదాయ బద్ధం గా శంకుస్థాపన కార్యక్రమాని పూర్తి చేశారు మూడు మతాలకు చెందిన పూజారులు వారి వారి పద్ధతి లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ అదనపు జిల్లా జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్,ఇంచార్జ్ మేజిస్ట్రేట్ హరికుమార్,సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషా తల్ప సాయి,బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు

ఈ. కార్యక్రమంలో పోశెట్టి,బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జి. శ్యామరావు, ప్రభుత్వ న్యాయవాదులు గౌశుద్దీన్, బొగ్గుల రవీందర్,బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు,ఎస్ ఎస్ ఆర్ కోటేశ్వరరావు, అప్సర్ పాషా,న్యాయవాదులు నర్సింహారెడ్డి,గోపాల్ రెడ్డి, సంగం,హన్మంతరావు, గంగారెడ్డి,ఈశ్వర్,అడ్లూరి శ్రీనివాస్, బాణోత్ రమేష్. పోలీస్ సిబ్బంది కోర్ట్ సిబ్బంది,ఆర్&అండ్ బి శిబ్బంది,కాంట్రాక్టర్ వెంకట రమణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular