Saturday, February 14, 2026

అమరుల ప్రాణాలకు విలువ కట్టలేము

కలెక్టర్ ఆశిష్ సాoగ్వాన్

ద్రోణ కామారెడ్డి

పోలీస్ అమరవీరుల త్యాగల ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌబ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సా0గ్వాన్ అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయాలు కొనసాగిద్దాం అని జిల్లా ఎస్పీ సింధు శర్మ పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు అర్పించారు. వారి ప్రాణాలకు డబ్బుతో విలువ కట్టలేమని అన్నారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలియజేశారు. అమరుల కుటుంబ సభ్యులకు 300 గజాల ప్లాట్ పత్రాలు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలిసి నివాళులు. అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్, ఎస్పీ కామారెడ్డి జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 7 మంది పోలీసులు అసువులు బాసారని వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని పోలీసుల త్యాగనీ రతిని నిరంతరం మననం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రజా అవసరాల కోసం సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి పథకాలు అందుతాయని తెలిపారు. అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు సిరస్మరణీయమని అమరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవలసిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. దేశ సరిహద్దుల్లోని అక్షయ్ చిన్ ప్రాంతంలో పహారకాస్తున్న పదిమంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వీధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్న వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని గో త్యాగాలను స్మరించుకుంటూ వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమం వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను సర్వస్వం లభిం పజేయడం, ఆయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడమే పోలీస్ అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీసుల ఆధ్వర్యంలో

ఈరోజు నుండి ఈ నెల 31 వరకు రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్, వ్యాచారచన పోటీలు, ఫోటో వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి త్యాగాల కు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నరసింహ రెడ్డి, కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు, ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసులు, డి.ఎస్.పి యాకూబ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, సంతోష్ కుమార్, శ్రీనివాసులు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న ఎస్ఐలు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular