Saturday, February 14, 2026

వ్యాధుల నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

ద్రోణ బోధన్

జిల్లా కీటక జనత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సోమవారం బోధన్ అర్బన్ ఆస్పత్రి నీ సందర్శించారు. ఆయనతో పాటు బోధన్ ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా సమతా ఉన్నారు.దోమల వలన వ్యాధులు మరియు దోమలను నిర్మూలించే విధానం గురించి బోధన్ లోని పలు ఇండ్లను సందర్శించి వివరించారు.

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బంది వివరించారు. డెంగీ మరియు మలేరియా రాకుండా నివారణ ఉపాయాలను వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న రోగుల వివరాలను తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి తప్పకుండా ల్యాబ్ టెస్ట్ లు చేయాలని సంబంధిత ఉద్యోగస్తులను ఆదేశించారు. ఆ తర్వాత బస్తీ దవఖానాలో పాన్ గల్లి, రాకాసిపేట ఆశా వర్కర్లకు ఏఎన్ఎం లకు సూపర్వైజర్లకు సమావేశం నిర్వహించి దోమల వలన కలిగే వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేశారు.

ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ద్వారా సర్వే నిర్వహించాలని, స్కూల్ మరియు హాస్టల్ ను సందర్శించి వివరాలు సేకరించాలని. Ades లార్వా సర్వేను ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular