ద్రోణ బాన్సువాడ
అడవి బిడ్డల హక్కుల కోసం పిడికిలెత్తిన వీరుడు,నిజాం గుండెల్లో భయం పుట్టించిన సాయుధ విప్లవకారుడు,‘జల్ జంగల్ జమీన్’ అంటూ నినదించిన ధీరుడు,


ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రాణత్యాగం చేసిన గిరిజన నాయకుడు కొమురం భీం ఆదర్శష ప్రాయులని వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే కొమరం భీం జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


బాన్సువాడ మండలం హనుమాజీపేట గ్రామంలో గిరిజనులు కొమరం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. హన్మాజీపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని పోచారం ఆవిష్కరించారు. పోచారం వెంట ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం బోర్లం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో హన్మాజీపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాలలో బాన్సువాడ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, రైతులు,ప్రజలు పాల్గొన్నారు.
