Saturday, February 14, 2026

అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి

ద్రోణ కామారెడ్డి జిల్లా ప్రతినిధి

అంగన్ వాడి కేంద్రాలలో వసతుల కల్పనకి తన వంతు కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సక్షేమశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 59 అంగన్ వాడి కేంద్రాల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని ఆయా అంగన్వాడి కేంద్రాల్లో సరియైన వసతుల కల్పనకి కృషి చేస్తానని అన్నారు. గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్ వాడిల భాద్యత అని గుర్తు చేశారు. మహిళా హక్కులు, పిల్లల హక్కులు కాపాడంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వద్దనీ అన్నారు. అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular