Saturday, February 14, 2026

సహకార సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ద్రోణ నిజాంబాద్ ప్రతినిధి

నిజామాబాద్ జిల్లా డిసిసిబి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులకు,కార్యదర్శులకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు పాలకవర్గాలకు మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని అందరూ కలిసి పనిచేసి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. సహకార సంఘాలు అంటే కేవలం వరి కొనుగోలు చేసి ఎరువులు అమ్మి కొనసాగించడం మాత్రమే కాదు అని కేవలం వరి కొనుగోలు ద్వారానే సంస్థల యొక్క మనుగడ కొనసాగదని ఆయన అన్నారు. సహకార సంఘాలలో ప్రతిపత్తి కాకుండా వ్యాపారాలు చేసి సంస్థల యొక్క భవిష్యత్తును బలంగా చేయాలని ఆయన అన్నారు. రైతులకు ముఖ్యమైన సూచనలు ఎలాంటి విత్తనాలు వాడాలి ఎంత మోతాదు ఎరువు వాడాలి పొలంకు వచ్చిన రోగాలకు సంబంధించిన నివారణ చర్యలను కూడా శాస్త్రవేత్తలు మరియు అధికారులు రైతులకు తెలుపాల్సిన బాధ్యత వారి పైన ఉందని వివరించారు. పంటలలో వరి మాత్రమే కాకుండా చెరుకు వంటివి కూడా సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

వడ్ల కొనుగోలు విషయంలో ప్రతి సొసైటీలో బాధ్యతగా వ్యవహరించాలని 17 శాతం తేమ వచ్చిన వడ్లను తీసుకోవాలని తడిగా ఉన్న ధాన్యాన్ని వాతావరణాన్ని బట్టి ఒకరోజు ఎండబెట్టి తీసుకోవాలని రైతులకు కూడా వాతావరణానికి అనుగుణంగా పంట పొలాలు కోతలు నిర్వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం త్వరలోనే కొనుగోలు మొదలు పెడుతుందని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గోదాములు అన్ని నిండిపోయాయని ఇప్పుడు కొనుగోలు చేసి ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular