Saturday, February 14, 2026

తిర్మన్ పల్లి పిహెచ్ సీ సెంటర్ లో ఉత్తమ వైద్య సేవలు.

ద్రోణ నిజామాబాద్:-

నిజామాబాద్ రూరల్ పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉత్తమంగా ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు.గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించిన తరువాత కొన్ని సంవత్సరాల పాటు నిరుపయోగంగా ఉండింది.ప్రజలకు వైద్య సేవలు అందించానే సంకల్పంతో గ్రామ మజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య కేంద్రాన్ని తెరిపించి అనేక గ్రామాలకు చెందిన ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు.

ఇందుకు పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ మజీ సర్పంచ్,డాక్టర్ అఖిల్ కు గ్రమాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు సమకుర్చడంతో అన్ని రకాల రోగాలకు వైద్యం అందుతుంది.

వైద్యులు సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు సమయపాలన పాటిస్తు ఆరోగ్య కేంద్రాన్ని తెరుస్తు ప్రజలకు వైద్యం అందిస్తున్నారు.వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular