Saturday, February 14, 2026

యువతలో నైపుణ్యాన్ని మరింత పెంపొందించాలి

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

తెలంగాణ యువతలో నైపుణ్యం మరింత పెంపొందించి ప్రపంచంలో మన యువత పోటీపడే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మరియు ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ,యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో తెలంగాణ యువతను ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ కి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.

స్కిల్స్ వర్సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ సి ఎస్ ఆర్ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.

సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు మెఘా కంపెనీకి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular