Saturday, February 14, 2026

నిబంధనలకు లోబడి టపాకాయల దుకాణాలు నిర్వహించాలి

నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ సిపి

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-

దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ సి.పి సింధు వెల్లడించారు. దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందగలరు. సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించగలరు. ఎవ్వరయిన “సంబంధిత పోలీస్ డివిజినల్ “స్థాయి అధికారి నుండి అనుమతిలేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు -1884 మరియు రూల్స్ – 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకొనబడును అని సిపి హెచ్చరించారు.టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి. టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొల్పవలెను. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి. ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించరాదు. జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు. తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇట్టి దరఖాస్తు ఫారం పోలీస్ వెబ్సైట్ www.nizamabadpolice.in లో ఆన్ లైన్ పొందపర్చడం జరిగింది. అట్టి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలతో సంబంధిత ఎ.సి.పి కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవలెను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular