Saturday, February 14, 2026

ప్రతి కుటుంబ వివరాలను సేకరించాలి

ద్రోణ బోధన్:-

సోషల్ ఎకనామిక్ సర్వేలో భాగంగా గ్రామాలలోని ప్రతీ ఇంటి యొక్క వివరాలను సేకరించి నివేధికలలో పోందుపరచాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

శుక్రవారం బోధన్ మండలంలో సోషల్ ఎకనామిక్ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బోధన్ మండలం లంగ్డాపూర్ గ్రామంలో చేపడుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు.తప్పులు దొర్లకుండా సర్వే నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.ఏమైనా తెలియని ఎడల మండల స్థాయి అధికారుల సూచనలు పొందుతు సర్వే చేపట్టాలని సూచించారు.సర్వే అనంతరం అధికారుల ఆదేశాల మేరకు నివేధికలను సమర్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు.కుటుంబాలకు సంబందించిన వివరాలను పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.

ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సర్వె సమర్థవంతంగా చేయాలని కొరారు.లేని ఎడల శాఖా పరమైన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో,టిపిసిసి డెలిగెట్ గంగాశంకర్,మండల తాహశీల్దార్ విఠల్,ఎంపివో మధుకర్,సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular