Saturday, February 14, 2026

కొనుగోళ్లలో అవకతవలు జరిగితే సహించే ప్రసక్తే లేదు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర సచివాలయం వేదికగా మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్, మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాట్సాప్(8897281111) ద్వారా రైతులు సేవలు ఉపయోగించుకోవాలని సూటించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలు పడుతున్నందున అధికారులతో పాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పత్తి కొనుగోళ్ల లో అవకతవకలు జరిగితే తక్షనమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular