Saturday, February 14, 2026

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ద్రోణ కామారెడ్డి ప్రతినిది

కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల పరిధిలోని కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అందుకు సంబంధించి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ చేయడం జరిగిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సంబధిత అధికారులకు సూచించారు. రైతులు సహకరించాలని సూచించారు. శనివారం నాడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ మరియు సంబంధిత అధికారులతో పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలను పాటించి,ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలని పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.
ఈ విషయం గురించి శనివారం పోచారం శ్రీనివాసరెడ్డి స్వగృహంలో రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించి రైతులకు ఇబ్బంది కలగకుండా వరిధాన్యం తీసుకోవాలని సూచించడం జరిగింది.

ఇట్టి సమావేశం లో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజి రెడ్డి , బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి , బుడ్మి సొసైటీ అధ్యక్షులు గంగారం,బుడ్మి మాజీ సొసైటీ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ , బుడ్మి సొసైటీ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , రైస్ మిల్లర్లు నాగులగమ వెంకన్న, సంతోష్ ,ఎల్లారెడ్డి ,ఇతర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular